భారత్‌తో యుద్ధం వస్తే అణ్వాయుధాలు వాడ్తాం: పాక్

భారత్‌తో యుద్ధం వస్తే అణ్వాయుధాలు వాడ్తాం: పాక్

రాచీ: అణు సామర్థ్యంపై పాకిస్థాన్ తొలిసారిగా బహిరంగ వ్యాఖ్యలు చేసింది. తమ వద్ద తక్కువ శక్తిని విడుదల చేసే అణ్వాయుధాలు ఉన్నాయని, ఒకవేళ భారతదేశంతో యుద్ధం చేయాల్సి వస్తే వీటిని వాడతామని పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శి ఐజాజ్ చౌధురి స్పష్టం చేసినట్టు 'డాన్' పత్రిక వెల్లడించింది. కాగా, పాకిస్థాన్ కు చెందిన సీనియర్ అధికారి ఒకరు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి. తమ యుద్ధ వ్యూహాల్లో భాగంగానే వీటిని తయారు చేశామని ఆయన తెలిపారు. ప్రధాని నవాజ్ షరీఫ్ ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా యూఎస్‌తో ఎటువంటి అణు ఒప్పందాన్ని చేసుకోలేదని ఆయన వివరించారు.
Pakistan Develops Nuclear Weapons to Combat Possible War With India
 తమ దేశ అణు కార్యక్రమాలు యుద్ధాన్ని ప్రేరేపించేందుకు కాదని, ముందు జాగ్రత్త చర్యల కోసమేనని ఆయన చెప్పారు. కాగా, అక్టోబర్ 22న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను షరీఫ్ కలవనున్నారు. పలు షరతులు 
విధించి పాకిస్థాన్‌తో అణ్వాయుధ ఒప్పందాన్ని చేసుకోవాలని అమెరికా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

IF INDIANS Decide to spoil Pakistan it won't take more than 5 minutes....
                                                                                                                  - BALAJI, 20-Oct-2015.

Read more at: http://telugu.oneindia.com/news/international/pakistan-develops-nuclear-weapons-combat-possible-war-with-india-166039.html

Comments